తెలంగాణ

telangana

ETV Bharat / state

సభ్యత్వ నమోదుపై భాజపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో భాజపా బలోపేతానికి పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు సభ్యత్వ వారంగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించింది. 7 రోజుల్లో 13 లక్షల ఇళ్లకు వెళ్లి సభ్యత్వ నమోదు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు.

భాజపా నాయకత్వం

By

Published : Jul 27, 2019, 5:03 AM IST

Updated : Jul 27, 2019, 7:07 AM IST

సభ్యత్వ నమోదుపై భాజపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదుపై భాజపా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆగస్టు 1 నుంచి 7 వరకు సభ్యత్వ వారంగా చేపట్టాలని స్పష్టం చేసింది. ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కమల దళం భావిస్తోంది. ఈ విధంగా రాష్ట్రంలో 13 లక్షల ఇళ్లకు వెళ్లాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 4.8 లక్షల కొత్త సభ్యత్వాలు చేయించినట్లు రాష్ట్ర భాజపా నాయకులు.. ఆ పార్టీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు వివరించారు. సభ్యత్వ నమోదు ఆగస్టు 11తో పూర్తవనుండగా... అదే నెల 7 నాటికే లక్ష్యాన్ని చేరాలని పార్టీ శ్రేణులకు నడ్డా సూచించారు.

హైదరాబాద్​పై నజర్​

వారం రోజుల పాటు 6,800 మంది పూర్తి స్థాయి కార్యకర్తలు సభ్యత్వ నమోదుకు 13 లక్షల ఇళ్లకు వెళ్లి... ఒక్కో కుటుంబంతో మాట్లాడి పార్టీలో చేరాలని విన్నవిస్తారని భాజపా నేతలు వివరించారు. గ్రేటర్​ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేయాల్సిందేనన్న అమిత్​షా ఆదేశాలకు అనుగుణంగా కృషి చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి : కేసీఆర్, జగన్​కు మాజీ సీఐసీ​ శ్రీధర్​ ప్రశ్న

Last Updated : Jul 27, 2019, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details