తెలంగాణ

telangana

ETV Bharat / state

organ donors association: 'అవయవ దానానికి అందరూ ముందుకు రావాలి'

అవయవ దానంపై అందరికీ చైతన్యం రావాల్సిన అవసరం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరారు. పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆర్గాన్‌ డోనార్స్‌ అసోసియేషన్‌ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

organ donors association, bandi sanjay
బండి సంజయ్, అవయవ దానం అసోసియేషన్

By

Published : Jul 9, 2021, 4:15 PM IST

అవయవ దానం(organ donation) చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని భాజపా(bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(bandi sanjay) కోరారు. అందరికీ అవయవదానంపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్క్‌ హయత్‌లో భాజపా సీనియర్‌ నేత గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆర్గాన్‌ డోనార్స్‌ అసోసియేషన్‌(telangana organ donors association) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్గాన్‌ డోనార్స్‌ అసోసియేషన్‌ లోగోను ఆవిష్కరించారు.

సేవలు భేష్

అవయవ దానం అవసరాన్ని గుర్తించి ఈ సేవలను గూడూరు నారాయణ రెడ్డి ప్రారంభించడం ఎంతో సంతోషకరం. కొవిడ్‌ సమయంలోనూ ప్లాస్మా డోనార్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి వేల మంది కరోనా బాధితులకు సేవలు అందించారు. జీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌(GNR FOUNDATION) ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. అవయవ దానంపై సమాజంలో మార్పు కోసం ప్రయత్నించడం గొప్ప విషయం.

-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

15 ఏళ్లుగా...

జీఎన్ఆర్ ఫౌండేషన్ పేరిట తాను 15 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు భాజపా సీనియర్‌ నేత గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవయవదానం కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారని, తరచూ బయట ప్రాంతాల నుంచి అవయవాలు తీసుకురావడం చూస్తున్నామన్నారు. అవయవదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసమే అసోసియేషన్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమానికి కాంటినెంటిల్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ గురునాథ్‌ రెడ్డి, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ భాటియా హాజరయ్యారు.

అవయవదానంపై బండి సంజయ్

ఇదీ చదవండి:BANDI SANJAY: భాజపా పెట్టిన పొగతోనే ప్రజల్లోకి సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details