తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి: బండి సంజయ్​ - bandi sanjay speech

ప్రైవేటు ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వక పోతే ఆయా సంస్థల సిబ్బందే... కార్పొరేట్ కాలేజీలను ముట్టడించే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

bjp state president bandi sanjay on private teachers salaries
ప్రైవేటు ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి: బండి సంజయ్​

By

Published : Feb 12, 2021, 2:12 PM IST

ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు లెక్చరర్లు, టీచర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. చైతన్యపురిలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ లెక్చరర్ డా.హరినాథ్ జీతాలు లేక ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలిచి వేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన అధ్యాపకులను జీతాలివ్వకుండా వేధించి వాళ్ల ఉసురు పోసుకోవద్దని హితవు పలికారు. సిబ్బంది ఇన్నాళ్లు శ్రమించడం వల్లనే కార్పొరేట్ సంస్థలు కోట్లు సంపాదించుకుని ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం అమానవీయమన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ, అధ్యాపకులను మాత్రం వేతనాలు ఇవ్వకుండా వేధిస్తారా అని మండిపడ్డారు. టీచర్లు, లెక్చరర్లకు జీతాలు ఇవ్వక పోతే ఆయా సంస్థల సిబ్బందే కార్పొరేట్ కాలేజీలను ముట్టడించే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details