గ్రామపంచాయతీలకు తెరాస ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని భాజపా రాష్ట్ర బండి సంజయ్ విమర్శించారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని అన్నారు.
'కేంద్ర నిధులతోనే పంచాయతీల్లో అభివృద్ధి.. కేసీఆర్ ఇచ్చింది శూన్యం' - బండి సంజయ్ వార్తలు
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని.. ఫలితంగా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ఒత్తిడికి గురవుతున్నారని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని అన్నారు.
సర్పంచ్‌లు ఒత్తడికి గురవుతున్నారు: బండి
నిజామాబాద్ గ్రామీణ జిల్లా డిచ్‌పల్లి, మోపాల్ మండలానికి చెందిన నాయకులు... జాతీయ నాయకుల సమక్షంలో భాజపాలో చేరేందుకు దిల్లీ వెళ్లారు. 12 మంది ఎంపీటీసీలు, 10 మంది సర్పంచ్‌లు రాజీనామా చేసినవారిలో ఉన్నారు. వీరంతా రేపు భాజపాలో చేరనున్నారు.
ఇదీ చదవండి:ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తొస్తారు: జీవన్ రెడ్డి