భాజపా నేతలు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఆంటోనిరెడ్డి ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ రిగ్గింగ్‌కు పాల్పడిందని వారు ఆరోపించారు. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
''మేము సమాచారం ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేశారు. నిన్న సాయంత్రం కొన్ని బూత్‌లలో ఆకస్మాత్తుగా పోలింగ్ పెరిగింది. ఝాన్సీబజార్, పురానాపూల్ పోలింగ్ బూతుల్లో 94 శాతం పైగా పోలింగ్ జరిగింది. రిగ్గింగ్ జరిగిందని చెప్పాడానికి ఇదే నిదర్శనం. ఈ విషయంపై విచారణ జరిపి వాస్తవాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ పోలింగ్ బూత్‌లలోకి వెళ్లినట్లు సమాచారం ఉంది.''