రాఫెల్ ఆరోపణలపై రాహుల్ గాంధీ దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలంటూ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహాం వద్ద భాజపా నేతలు నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అవినీతికి పరాకాష్ఠ అంటూ లక్ష్మణ్ ఆరోపించారు. తమపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
'ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం' - laxman protest against of congress
కాంగ్రెస్ పార్టీ భాజపాపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తూ... బురద చల్లాలనుకుంటే చూస్తూ కూర్చోమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు.
'ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం'
ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ అరెస్ట్