తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆత్మహత్యకు పాల్పడ్డ అనామిక అక్కకు భాజపా చేయూత' - బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్

ఇంటర్​ బోర్డు తప్పిదాల వల్ల ఫెయిల్​ అయిన అనామిక అక్క ఉదయశ్రీ చదువుకు అయ్యే ఖర్చును భాజపా భరిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. పదిహేను వేల రూపాయల చెక్కును ఆమెకు అందజేశారు.

ఆత్మహత్యకు పాల్పడ్డ అనామిక అక్కకు చేయూత: లక్ష్మణ్​

By

Published : Aug 21, 2019, 2:48 PM IST

ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఫెయిల్ అయి.. ఆత్మహత్య చేసుకున్న అనామిక అక్క ఉదయశ్రీ చదువుకు అయ్యే ఖర్చును భాజపా భరిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కోఠిలోని ప్రగతి మహావిద్యాలయాలలో డిగ్రీ చదువుతున్న ఉదయశ్రీని లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే రాజసింగ్​తో కలిసి పరామర్శించారు. 15వేల రూపాయల చెక్కును అందజేశారు. చనిపోయిన అనామిక కుటుంబాన్ని అధికార పార్టీ నేతలు పరామర్శించకపోవడం దారుణమన్నారు. 27మంది విద్యార్థుల చావుకు కారణాలు ప్రభుత్వం చెప్పలేకపోయిందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి నివేదిక అడిగినప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. తమకు అండగా నిలిచిన భాజపాకు ఉదయశ్రీ కృతజ్ఞతలు తెలిపింది.

ఆత్మహత్యకు పాల్పడ్డ అనామిక అక్కకు చేయూత: లక్ష్మణ్​

ABOUT THE AUTHOR

...view details