తెలంగాణ

telangana

ETV Bharat / state

బంగారు తెలంగాణ కాదు...బకాయిల తెలంగాణ

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్​నాథ్‌ కోవింద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే సమాధానం చెప్పకుండా కేసీఆర్‌ తమపై బురదజల్లుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. 27మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం స్పందించకపోవడం సరైనదేనా అని పశ్నించారు.

Bjp

By

Published : Aug 16, 2019, 8:47 PM IST

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్​నాథ్‌ కోవింద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే సమాధానం చెప్పకుండా కేసీఆర్‌ తమపై బురదజల్లుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. 27మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం స్పందించకపోవడం సరైనదేనా అని పశ్నించారు. అర్హతలేని గ్లోబరీనా సంస్థ మీద, బాధ్యులైన ఉద్యోగుల మీద చర్యలు తీసుకోకపోవడంలో మతలబు ఏంటని నిలదీశారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని బకాయిల తెలంగాణగా మార్చారని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు.

బంగారు తెలంగాణ కాదు...బకాయిల తెలంగాణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details