తెలంగాణ

telangana

ETV Bharat / state

'వేగం'గా గుంతలోపడి.. క్రేన్లతో బయటకొచ్చాడు

ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న పై వంతెన గుంతలో పడ్డ యువకుడు.. స్థానికుల చొరవతో బతికి బయటపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్​ సంతోష్​నగర్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

bike accident in hyderabad santhosh nagar one person injured
వేగంగా గుంతలోపడి.. క్రేన్లతో బయటికొచ్చాడు

By

Published : Mar 14, 2020, 9:06 AM IST

హైదరాబాద్ సంతోష్​ నగర్ పోలీస్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న పై వంతెన గుంతలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అర్ధరాత్రి సమయంలో లక్కీ హోటల్ సమీపంలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న గుంతలో పడిపోయాడు.

అది గమనించిన స్థానికులు క్రేన్ల సాయంతో అతడిని పైకి తీశారు. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. క్షతగాత్రుణ్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

'వేగం'గా గుంతలోపడి.. క్రేన్లతో బయటకొచ్చాడు

ఇదీ చదవండి:కరోనా బారిన పడకుండా ఉండాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details