తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి విషయంలో అంతా మీ ఇష్టమేనా..? - VIKRAMARKA BHATTI

"రాష్ట్రంలో ఓ వైపు రైతుబంధు, రుణమాఫీ, యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  మరోవైపు విషజ్వరాలతో విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రతిపక్షాలను విమర్శించడం దారుణం": భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

యాదాద్రి విషయంలో అంతా మీ ఇష్టమేనా..?

By

Published : Sep 6, 2019, 3:23 PM IST

యాదాద్రి ఆలయ శిలలపై కేసీఆర్‌, కారు గుర్తులు చెక్కడం సరికాదన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. యాదాద్రికి అన్ని వర్గాల ప్రజలు వస్తారని అక్కడ పార్టీలకు తావులేదని భట్టి తెలిపారు.రైతులను అవమానపరిచిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంటనే రైతులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు కింద ఇస్తామన్న నిధులు ఇప్పటివరకు విడుదల చేయలేదని విమర్శించారు. రైతు ప్రభుత్వమని చెబుతూనే అన్నదాతలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు విష జ్వరాలు, డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటి సమస్యలతో బాధపడుతునంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రజల బాగోగుల కోసం మంత్రులు స్పందించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రసమయి బాలకిషన్‌ చెప్పినట్లుగా.. తెలంగాణ బోర్డు, కేసీఆర్‌ కుటుంబం మాత్రమే మారాయని విమర్శించారు. మంత్రులు కేసీఆర్‌ కుటుంబానికి తాబేదారులుగా మారవద్దని సూచించారు.

యాదాద్రి విషయంలో అంతా మీ ఇష్టమేనా..?

ABOUT THE AUTHOR

...view details