BC MLA Ticket issue in Congress Telangana : ప్రజల్లో ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా గెలుపు ప్రాతిపదికగా పనిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలకు(Congress BC Leaders) ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో 34 సీట్లు కేటాయించాలని దిల్లీ పెద్దల్ని నేతలు కలుస్తానన్నారు. ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఏఏ సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయించాలన్న విషయం తమకు తెలుసని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అంతర్గతంగా తేల్చుకోవాల్సిన వ్యవహారాన్ని మీడియా ముందుకు తెచ్చారని వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Telangana CongressBC MLA Ticket issue: రానున్న ఎన్నికల్లో వెనుకబడిన కులాల వారికి 34 సీట్లు కేటాయించాలని రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలు దిల్లీలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నెల 27న 50మంది బీసీ నేతలు దిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనేతల్ని కలుస్తున్నారు. ఖర్గే, రాహుల్‌తో భేటీ ప్రయత్నిస్తున్నప్పటికీ.. అపాయింట్‌మెంట్ లేక వీలుపడటం లేదు. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కలిశారు.
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు తీరు పట్ల కేసీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీసీలకు సీట్ల కేటాయింపులో ఏవైనా అనుమానాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలిసింది. అలా కాకుండా మీడియా ముందుకెళ్లడం, పత్రికలలో వ్యాసాలు రాయడం.. తదితర అంశాలపై తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది.