Police notices for Bandi Bhagiratha: బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు పోలీసులు నోటీసులు జారీచేశారు. గత కొద్ది రోజుల కిందట మహీంద్ర వర్సిటీలో తోటి విద్యార్థిపై దాడి చేశాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథకు 41 ఏ సీఆర్పీసీ కింద దుండిగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బండి సంజయ్ కుమారుడు భగీరథకు నోటీసులు
16:49 January 27
బండి సంజయ్ కుమారుడు భగీరథకు నోటీసులు
ఇది జరిగింది:మహీంద్రా వర్సిటీకి చెందిన విద్యార్థిపై బండి భగీరథ దాడి చేసినట్టు విశ్వ విద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు కొద్ది రోజుల కిందట దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళాశాల ప్రాంగణంలోనే ఈ దాడి జరిగిందని.. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా దుండిగల్ పోలీసులు పలు సెక్షన్ల కింద భగీరథపై కేసు నమోదు చేశారు.
బండి భగీరథపై కేసు నమోదు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా స్పందిచారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేక బీఆర్ఎస్ ప్రభుత్వం తమ కుమారుడిపై కేసులు పెట్టించిందని ఆరోపించారు. రాజకీయ అవసరాలు కోసం కుటుంబీకులను ఉపయోగించుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అవి కళాశాల గొడవలని.. పిల్లలు ఈరోజు గొడవపడి రేపే ఒక్కటైపోతారని వ్యాఖ్యానించారు. తన కుమారుడు నిజంగా తప్పు చేస్తే ఏ శిక్ష వేసిన భరిస్తామని.. తానే స్వయంగా స్టేషన్కు తీసుకెళ్లి అప్పగిస్తానని పేర్కొన్నారు.
వీడియో హల్చల్.. సీన్ రివర్స్:బండి భగీరథ మహేంద్ర విశ్వవిద్యాలయంలో మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్నారు. శ్రీరామ్ అనే విద్యార్థిని దూషిస్తూ దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. ఈ క్రమంలోనే బాధిత విద్యార్థి వీడియో సైతం బయటికి వచ్చింది. బండి భగీరథ స్నేహితుడి చెల్లెల్ని వేధించినందుకే భగీరథ తనపై దాడి చేశాడని.. ఇందులో అతని తప్పేమీ లేదని శ్రీరామ్ వీడియోలో పేర్కొన్నాడు.
ఇవీ చదవండి: