Last Respects to General Bipin Rawat: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వీరసైనికులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు. దిల్లీ కామరాజ్ మార్గ్‌లోని నివాసంలో ఉంచిన బిపిన్ రావత్, మధులిక భౌతికకాయాలకు బండిసంజయ్ నివాళులు అర్పించారు.
Bandi Sanjay: దిల్లీలో రావత్ దంపతులకు బండి సంజయ్ నివాళులు
Last Respects to General Bipin Rawat: రావత్ దంపతులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు. దిల్లీ కామరాజ్ మార్గ్‌లోని నివాసంలో బిపిన్ రావత్, మధులిక భౌతికకాయాలకు పుష్పాంజలిని ఘటించారు.
రావత్ దంపతులకు నివాళులి
రావత్ దంపతుల భౌతికకాయాల వద్ద బండి సంజయ్ పుష్పాంజలిని ఘటించారు. దేశానికి ఆయన చేసిన అపురూప సేవలు ఎప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్ మార్గ్ నుంచి బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. సాయంత్రం 4 గంటలకు దిల్లీ కంటోన్మెంట్‌లో బిపిన్ రావత్ భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి:Last Rites of CDS: రావత్ దంపతులకు ప్రముఖుల నివాళి