తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆటో డ్రైవర్లను నెలకు రూ.5 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలి' - తెెలంగాణ తాజా వార్తలు

ఆటో డ్రైవర్లకు నెలకు రూ.5వేల ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని... ఏఐటీయూసీ తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని యూనియన్​ సమావేశంలో నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana news
ఆటో యూనియన్​ డిమాడ్లు

By

Published : May 20, 2021, 2:31 PM IST

లాక్​డౌన్​వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ నాయుకులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో యూనియన్​ సమావేశం నిర్వహించారు. ఆటో తిరిగితేనే కడుపు నిండుతుందని... పనిలేక, ఇల్లు గడవక... కొంత మంది కొవిడ్​తో తీవ్ర దుర్భర పరిస్థితిలో ఉన్నారని హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.మల్లేష్ అన్నారు.

ఆటో కిస్తీ చెల్లించలేక ఇబ్బందిగా ఉంటుందని, ఈఎంఐ చెల్లించకపోవడం వల్ల ఆటోను వదులుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్లకు ఇస్తున్నట్లుగా నెలకు ఐదు వేల రూపాయలతో పాటు 20 కిలోల బియ్యం అందించాలని కోరారు.

ఇదీ చూడండి:స్థిరాస్తి రంగంపై రెండో దశ కరోనా ప్రభావం

ABOUT THE AUTHOR

...view details