హైదరాబాద్ సైఫాబాద్‌లోని చిన్న గొడవ కత్తితో పొడుచుకునే వరకూ వెళ్లింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ లక్డీకపూల్‌లోని శ్రీ విగ్నేశ్వర హోటల్లో పని చేస్తున్నాడు. మూడురోజుల క్రితం వాసు అదే హోటల్లో పనికి చేరాడు. వారికోసం గణేశ్ సమీపంలోని మున్సిపల్ మైదానం పక్కన ఓ రూమ్ ఇచ్చారు.
యువకుల వాగ్వాదం... కత్తితో దాడి
ఇద్దరు యువకుల మధ్య మాటామాట పెరిగింది. అందులో ఒకరు ఆవేశంతో మరొకరిపై దాడికి దిగారు. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇద్దరి మధ్య గొడవ.. కత్తితో దాడి
ఈక్రమంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అది పెరిగి పెద్దదైంది. పవన్‌కల్యాణ్‌పై వాసు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు.
ఇదీ చూడండి:మహిళా అభిమానులూ నా భార్యతో జాగ్రత్త