ఓట్లకు లెక్కింపునకు సిద్ధమైన తెలంగాణ - ఎవరి భవితవ్యం ఏంటో మరి కొద్ది గంటల్లో Arrangements of Telangana Elections Counting 2023 :ఆదివారం జరిగే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్(Assembly Votes Counting) కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్‌తో పాటు జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, హైదరాబాద్ కలెక్టర్ కౌంటింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తవుతుందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు.
రాజేంద్రనగర్, షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు లార్డ్స్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు వివరించారు. ఎవరైనా ఎన్నికల కోడ్ నిబంధనలను(Provisions of Election Code) ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఏవీ కళాశాలలో కౌంటింగ్‌కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
"మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తాము. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలను తీసుకువచ్చి ప్రధాన ఓట్లను లెక్కిస్తాం. ప్రతి రౌండ్ 30 నుంచి 40 నిమిషాల్లో పూర్తి అవుతుందని భావిస్తున్నాం. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అన్ని రూంలలో కూడా బారికేడ్లు, కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశాం. పోలింగ్ స్టేషన్ ప్రకారం రౌండ్ ఆధారపడి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లో ఉల్లంఘనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు." - అనుదీప్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్
ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?
Telangana Assembly Elections 2023 News : ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14నియోజక వర్గాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. 7చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో రౌండ్‌కి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పరిశీలించారు. లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ రిటర్నింగ్ అధికారి తెలిపారు.
జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం జగిత్యాల వీఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. యాదాద్రి జిల్లాలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు 18, 22 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. సూర్యాపేట జిల్లాలో కౌంటింగ్ టేబుల్స్ పెంచేందుకు ఎన్నికల సంఘానికి నివేదించినట్లు కలెక్టర్ వెల్లడించారు. సిద్దిపేటలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాల, సంగారెడ్డి, పటాన్‌చెరు, ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజవకవర్గం లెక్కింపు జరిగే గీతం విశ్వవిద్యాలయం వద్ద మూడంచెల భద్రత కల్పించారు.
Arrangements of Election Counting in Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు సంబంధించి ఏనుమాముల మార్కెట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాల నియోజకవర్గాలకు ఆయా జిల్లాల్లో లెక్కింపు జరగనుందని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత తొలిఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
భాగ్యనగరంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి - 15 కేంద్రాల్లో కౌంటింగ్
రేపే జడ్జిమెంట్ డే- ఎలక్షన్ కౌంటింగ్‌కు ఈసీ ఏర్పాట్లు పూర్తి