ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,833కు చేరింది. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లా కూడా ఈ వైరస్ బారిన పడింది. తొలిసారి 3 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ జిల్లాలో బలిజపేట, సీతానగరం మండలాలకు చెందిన మహిళలకు కరోనా నిర్ధరణ అయింది.
ఆంధ్రప్రదేశ్లో మరో 56 కరోనా పాజిటివ్ కేసులు - విజయనగరం జిల్లాలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 56 మందికి కరోనా నిర్ధరణ అయింది. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లాకు ఈ మహమ్మారి సోకింది. ఈ జిల్లాలో తొలిసారిగా 3 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో మరో 56 కరోనా పాజిటివ్ కేసులు
కరోనా బారిన పడి ఏపీలో మరో ఇద్దరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 38కి చేరింది. 780 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. 1,015 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.