ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో గత 24 గంటల్లో 7,782 నమూనాలు పరీక్షించగా కొత్తగా 60 మందికి పాజిటివ్ వచ్చిందని ప్రకటించింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ సోకిన వారి సంఖ్య 1777కు చేరింది.
ఏపీలో మరో 60 మందికి కరోనా.. 1777కు చేరిన కేసులు
11:09 May 06
ఏపీలో మరో 60 మందికి కరోనా.. 1777కు చేరిన కేసులు
కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 36కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో కర్నూలు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇవాళ్టి కేసుల్లో గుజరాత్ నుంచి వచ్చిన 12 మందికి, కర్ణాటక నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 729 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించింది. వివిధ ఆస్పత్రుల్లో 1012 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది.
జిల్లాల్లో కొత్త కేసులు
- కర్నూలు జిల్లాలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు
- కృష్ణా జిల్లాలో 14 కేసులు
- గుంటూరు జిల్లాలో 12 కేసులు
- విశాఖ జిల్లాలో 2 కేసులు
- కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదు
ఇవీ చూడండి: 'కొన్ని రాష్ట్రాల తప్పుడు లెక్కలతోనే ఈ పెరుగుదల'