రాష్ట్రంలో మరో 1,891 కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణ కరోనా ఈరోజు సమాచారం
09:23 August 02
రాష్ట్రంలో మరో 1,891 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా మరో 1,891 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 66,677కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 540 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కొవిడ్ నుంచి కోలుకుని 47,590 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 18,547 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.3 శాతం, మరణాల రేటు 0.80 శాతం ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 517 కరోనా కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్ జిల్లాలో 146, వరంగల్ అర్బన్ జిల్లాలో మరో 138 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి :మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద హల్చల్ చేసిన దుండగులు అరెస్టు