ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (cm jagan) నేటి దిల్లీ పర్యటన వాయిదా పడింది. దిల్లీలో ముఖ్య నేతల అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతో పర్యటన వాయిదా పడింది. కొవిడ్ వాక్సినేషన్ (covid vaccination) బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని కోరడం సహా.. పలు సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు సీఎం దిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 3 రాజధానుల (three capitals) ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంలో కేంద్ర సహకారం తీసుకోవడంపైనా చర్చించాలని భావించారు.
Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా - AP CMO latest news
ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్యనేతలతో భేటీలు ఖరారు కాకపోవడంతో పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ తేదీ ఖరారు అయ్యాకే దిల్లీ వెళ్తారని సమాచారం.

Jagan Delhi Tour: సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా
పోలవరం ప్రాజెక్టు (polavaram project)కు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులు, కొవిడ్ (covid-19) దృష్ట్యా కేంద్రం నుంచి రాష్ట్రాలకు సాయం తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) బిజీగా ఉన్న కారణంగా ఆయన అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం. అమిత్ షాతో భేటీ ఖరారయ్యాకే దిల్లీ వెళ్లనున్నారు. వచ్చే వారం రోజుల్లో సీఎం దిల్లీ వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.