చాలాకాలం తర్వాత ఓపీ, ఎలక్ట్రిక్ సర్జరీలను ప్రారంభిచారు కదా. కొవిడ్ సమయంతో పోలిస్తే ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎలా ఉంది?
గతంతో పోలిస్తే కొవిడ్ సమయంలో రోగుల సంఖ్య బాగా తగ్గింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఓపీ సేవలను పూర్తి స్థాయిలో ప్రారంభించాం. లాక్ డౌన్ సమయంతో పోలిస్తే వాహనాలకు అనుమతి ఇవ్వటంతో 200 నుంచి 300 మంది అధికంగా ఆస్పత్రికి వస్తున్నారు. మరింత పెరిగే అవకాశం ఉంది.
లాక్ డౌన్‌కు ముందు ఓపీ కోసం ఎంతమంది వచ్చేవారు. లాక్ డౌన్ సమయంలో ఓపీ రోగుల సంఖ్య ఎలా ఉంది. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు?
సాధారణంగా 2000 నుంచి 2500మంది ఓపీకి వచ్చే వారు. 150 నుంచి 200 వరకు శస్త్రచికిత్సలు చేసేవాళ్లం. లాక్ డౌన్ సమయంలో 500 నుంచి 700మంది ఓపీ, 30 నుంచి 40 ఎమర్జెన్సీ కేసులు వచ్చేవి. గాంధీని కూడా కొవిడ్ ఆస్పత్రి చేయటం వల్ల ఓపీ ఇప్పుడు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ సర్జరీలను ఇప్పుడు తిరిగి ప్రాంభించారు. మరి ఈ కేసుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
నిన్నటి నుంచే ఓపీ ప్రారంభమైన నేపథ్యంలో ఎలక్ట్రిక్ సర్జరీలకు సంబంధించిన రోగులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వారిని ఆస్పత్రిలో జాయిన్ చేసుకుని పరీక్షలు చేశాక శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది.
ప్రతి రోగిని ఇప్పుడు కొవిడ్ పాటిజివ్ కేసుగానే భావించి.. జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో శస్త్రకిత్సలు నిర్వహించే థియేటర్లలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ?
డాక్టర్లకు పీపీఈ కిట్స్ ఇస్తున్నాం. రోగులకు వ్యక్తిగత శుభ్రతమీద అవగాహన కల్పిస్తున్నాం. మాస్కు ధరించినవారినే అనుమతిస్తున్నాం.
ఇప్పుడు ఉస్మానియాకు వచ్చే రోగులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?