ఇంటర్ ఫలితాల్లో తప్పులకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేసి... బోర్డు కార్యదర్శి అశోక్‌ను సస్పెండ్ చేయాలని ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్ దీనిని ప్రారంభించగా కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంఘీభావం ప్రకటించారు.
చర్యలెందుకు తీసుకోరు
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్ ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై చులకనగా మాట్లాడడం బాధాకరమని అన్నారు.