రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను పూర్తిగా నింపలేక పోయామన్న కేటీఆర్.. ఆ విషయాన్ని ఆలస్యంగానైనా గ్రహించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. బాధ్యతా రాహిత్యం, అసమర్థత కారణంగానే ఉద్యోగాల భర్తీ జరగలేదని విమర్శించారు. తామెప్పుడు కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు.
'కేటీఆర్.. ఆ విషయాన్ని ఆలస్యంగానైనా గ్రహించారు'
ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీతో పెద్ద ఎత్తున టీచర్ నియామకాలు జరిగాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో.. ఖాళీలను ఎందుకు నింపలేక పోయారో తెలపాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు.
'కేటీఆర్.. ఆ విషయాన్ని ఆలస్యంగానైనా గ్రహించారు'
ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీతో పెద్ద ఎత్తున టీచర్ నియామకాలు జరిగాయని దాసోజు శ్రవణ్ గుర్తు చేశారు. సింగరేణి, విద్యుత్, పంచాయతీ రాజ్ నియామకాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. త్వరలోనే ఆధారాలతో బయట పెడతామని తెలిపారు.
ఇదీ చదవండి:పెరుగుతున్న ధరలకు ఎవరు బాధ్యులు: కేటీఆర్