హిమగిరుల్లో కొలువైన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జులై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు భక్తులు ఇప్పటికే బాల్తల్, పహిలేగావ్ క్యాంపులకు చేరుకున్నారు.
ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో భద్రతా కట్టుదిట్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి భద్రతా బలగాలను మోహరించారు. ప్రతి వ్యక్తిని, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే క్యాంపులోకి అనుమతిస్తున్నారు.
'క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే క్యాంపులోకి అనుమతి'
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణిలో మహా శివుని భక్తులు అమర్ నాథ్ యాత్రకు పయనమవుతున్నారు. యాత్ర పహలేగావ్ పట్టణం నుంచి మొదలవుతుండగా నిఘా వర్గాల హెచ్చరికలతో ఈసారి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నారు.
క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే క్యాంపులోకి అనుమతి
ఇవీ చూడండి : సాగరతీరంలో సెయిలింగ్ సందడి
Last Updated : Jun 30, 2019, 7:48 AM IST