సికింద్రాబాద్ అల్వాల్ పరిధి రాజీవ్ రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హకీంపేట ఎయిర్ పోర్ట్ వద్ద లారీ కారును ఢీకొట్టడం వల్ల మధుసూదన్ అనే వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
లారీ, కారు ఢీ.. వ్యక్తి మృతి - ACCIDENT DEATH
హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట ఎయిర్ పోర్ట్ వద్ద లారీ కారును ఢీకొట్టింది. ప్రమాదంలో మధుసూదన్ అనే వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
'చికిత్స పొందుతూ వ్యక్తి మృతి'
వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడం వల్ల మధుసూదన్ తలకు తీవ్రమైన గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. ఫలితంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి తీవ్ర రక్తస్రావంతో మరణించాడని వైద్యులు వెల్లడించారు. గాంధీ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి : ఆగంతకుని దాడి... విద్యార్థిని దారుణ హత్య
Last Updated : Feb 11, 2020, 10:44 AM IST