తెలంగాణ

telangana

ETV Bharat / state

Gulab Cyclone Effect: కొట్టుకుపోయిన రోడ్డు... డోలి సాయంతో బాలింత తరలింపు

ఏపీలోని విజయనగరం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల(rains)కు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గిరిశిఖర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాగు ఉద్ధృతికి రోడ్డు కొట్టుకుపోవడంతో పాచిపెంట మండలం పనుకువలసకు చెందిన చోడిపల్లి బంగారమ్మ అనే బాలింతను డోలి సాయంతో తీసుకెళ్లారు.

Gulab Cyclone Effect
డోలీ సాయంతో బాలింత తరలింపు

By

Published : Sep 28, 2021, 12:31 PM IST

గులాబ్​ తుపాను(gulab cyclone) ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు జిల్లాలోని పాచిపెంట మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాచిపెంట మండలం కేరంగి పంచాయతీలోని పనుకువలసకు చెందిన చోడిపల్లి బంగారమ్మ అనే బాలింతను తీసుకెళ్లేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

డోలీ సాయంతో బాలింత తరలింపు

రోడ్డు కోతకు గురికావడమే కాక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో గిరిజనులు తమ ప్రమాణాలకు తెగించి సాహసం చేశారు. డోలి సాయంతో ఆ బాలింతను వాగు దాటించారు. పనుకువలస నుంచి పూడి వరకు కోరతకు గురైన మార్గంలో సుమారు 4 కిలోమీటర్ల వరకు డోలిలో తీసుకెళ్లారు. వర్షం పడిందంటే తమ కష్టాలు వర్ణనాతీతం అని గిరిజను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details