తెలంగాణ

telangana

ETV Bharat / state

స్థానికత కోల్పోయిన వారిని సొంత జిల్లాకు పంపాలి: ఉపాధ్యాయ సంఘం - రౌండ్‌ టేబుల్‌ సమావేశం

317 GO Teachers Round Table Meeting: ఉపాధ్యాయుల బదిలీ నిబంధనలు చట్టవిరుద్దంగా ఉన్నాయంటూ ఇటీవల నాన్​స్పౌజ్​ టీచర్లు హైకోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. దీనిపై మార్చ్ 23న విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్ 11 వరకు స్టేని పొడిగించింది. అయితే తాజాగా జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను వారి వారి సొంత జిల్లాల్లోకి తక్షణమే పంపించాలని బాధిత ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇదే విషయమై ఆ సంఘం ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్ సమావేశం నిర్వహించారు.

317 GO Teachers Round Table Meeting
317 GO Teachers Round Table Meeting

By

Published : Apr 9, 2023, 2:20 PM IST

317 GO Teachers Round Table Meeting: స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలోకి తక్షణమే పంపించాలని.. జీవో 317 బాధిత ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో.. 317 జీవో బాధిత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 317 జీవో కారణంగా చాలా మంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టు లేకుంటే సూపర్‌ న్యూమరీ పోస్టులను సృష్టించాలని డిమాండ్ చేశారు.

లేదంటే ఒక సర్టెన్​ పీరియడ్ పెట్టి వారి జిల్లాలకు పంపుతామని ఒక జీవో తీసుకొచ్చినట్లైతే ఆ ఉపాధ్యాయులకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ముందు ఉపాధ్యాయులతో భేటీ అయ్యి.. అన్ని విధాల సమస్యలను తీర్చి ఆదుకుంటామన్న కేసీఆర్‌ ఇప్పుడు మాట తప్పడం ఏంటని ప్రశ్నించారు. అనేక విధాలుగా కేసుల నేపంతో ఉపాధ్యాయులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుకు సంబంధం లేని సమస్యలతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకధాటిపైకి వచ్చినప్పుడే మన ఉపాధ్యాయుల హక్కులను సాధించుకోగలుగుతామని ఉపాధ్యాయ సంఘం నాయకులు స్పష్టం చేశారు.

TS High Court stay on Teachers Transfers: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై విధించిన స్టేను హైకోర్టు ఏప్రిల్ 11 వరకు పొడిగించిన విషయం విధితమే. అయితే బదిలీల నిబంధనలు సవాల్ చేస్తూ.. నాన్​స్పౌజ్ కేటగిరీ టీచర్లు వేసిన పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి ముందుకు మరోసారి విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయలేదు. ఇందుకుగాను మరోవైపు తమ తరఫు వాదనను కూడా వినాలని కోరుతూ స్పౌజ్ కేటగిరీ టీచర్లు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.

అన్నింటిని కలిపి ఈనెల 11న విచారణ జరుపుతామన్న హైకోర్టు.. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. భార్యాభర్తలు, గుర్తింపు పొందిన యూనియన్ నేతలకు బదిలీల్లో అదనపు పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ.. నాన్​స్పౌజ్ కేటగిరీ టీచర్లు వేసిన పిటిషన్​పై గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

'స్థానికత ఆధారంగానే టీచర్లను పంపిచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే'

కచ్చితంగా స్థానికత ఆధారంగానే ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు పంపిచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఒక వేళ పోస్టు లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టు​లు క్రియేట్ చేయాలి. లేదంటే ఒక పీరియడ్ పెట్టి ఆ కాలం లోపల మీ జిల్లాలకు పంపుతామని ఒక జీవో తీసుకొచ్చినట్లైతేనే ఈ సమస్యకు పరిష్కారం. -హనుమంతురావు, తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details