ఉపాధి కోసం ఒడిశా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తికి లాక్డౌన్ సమయంలో పనులు లేక ఇబ్బంది పడ్డాడు. మానసిక ఒత్తిడికి గురై మతిస్తిమితం కోల్పోయాడు. బాలాపూర్, ఆర్సీఐ, విజ్ఞాన్ కంచ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో చేర్పించారు.
కుటుంబ సభ్యుల చెంతకు మతిస్తిమితం కోల్పోయిన వ్యక్తి
మతిస్తిమితం కోల్పోయిన ఓ వ్యక్తిని మాతృదేవోభవ ఆశ్రమం అతని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చనుంది. ఒడిశా నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ వ్యక్తిని మాతృదేవోభవ ఆశ్రమం చేరదీసింది. ఈటీవీ భారత్ సహయంతో కుటుంబ సభ్యులకు అప్పగించనుంది.
అతనికి వైద్యం అందించారు. కొన్ని రోజుల తర్వాత ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి అతని గురించి వాకబు చేయగా తన పేరు అర్జున్ అని వయసు 26 సంవత్సరాలని.. తన స్వస్థలం ఒడిశాలోని కొరపూట్ జిల్లా దలియమ్ గ్రామమని చెప్పాడు. గిరి వెంటనే స్థానిక ఈటీవీ భారత్ ప్రతినిధికి ఇతని వివరాలను అందించారు. ఈటీవీ భారత్ ప్రతినిధి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువకుడి ఫొటోను కుటుంబ సభ్యులకు పంపించటంతో అతనిని గుర్తుపట్టారు. అర్జున్ తీసుకెళ్లెందుకు త్వరలో హైదరాబాద్ రానున్నారు.