రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 873 కేసులు నమోదు కాగా మరో నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,63,526 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి ఇప్పటివరకు 1,430 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కొత్తగా 873 కరోనా కేసులు, నలుగురు మృతి
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా 873 పాజిటివ్ కేసులు నమోదు కాగా... నలుగురు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,643 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 873 కరోనా కేసులు, నలుగురు మృతి
కరోనా నుంచి మరో 1,296 మంది బాధితులు కోలుకోగా... వారి సంఖ్య 2,50,453కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,643 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 9,345 మంది బాధితులుండటం గమనార్హం. అటు జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 152 కరోనా కేసులు నమోదుకాగా... మేడ్చల్ జిల్లాలో 78, రంగారెడ్డి జిల్లాలో 71 మందికి కొవిడ్ సోకింది.
ఇదీ చూడండి:కరోనా సంక్షోభానికి తలవంచని 'అంకురాలు'