తెలంగాణ

telangana

ETV Bharat / state

జంట పేలుళ్లకు ఆరేళ్లు

హైదరాబాద్​ మజిలీలో అదొక మరచిపోని రోజు... నగరం రక్తపు కన్నీరు కార్చిన చీకటి దినం... రాజధాని ఉలిక్కిపడి బావురుమన్న దుర్దినం... ఎందరో అమాయకులు అసువులు బాసిన జంట పేలుళ్ల ఘటనకు అప్పుడే ఆరేళ్లు.

జంట పేలుళ్ల బాధితులకు శ్రద్ధంజలి

By

Published : Feb 21, 2019, 3:52 PM IST

జంట పేలుళ్ల బాధితులకు శ్రద్ధంజలి

హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​లో జంట పేలుళ్ళు జరిగి నేటికి ఆరేళ్లు పూర్తైన సందర్భంగా ప్రాణాలు కోల్పోయినవారికి ఎల్బీనగర్​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవల పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండించిన సుధీర్​రెడ్డి... త్వరలోనే వారికి బుద్ధి చెప్పాలని ఆకాంక్షించారు.
గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, గోకుల్ చాట్ బాంబు పేళుడు బాధితుడు సయ్యద్ రహీమ్, స్థానికులు కార్యక్రమంలో పాల్గొని బాధితులకు నివాళులర్పించారు.
ఇదీ చదవండి:'కేసరి' గర్జన

ABOUT THE AUTHOR

...view details