రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. తాజాగా 337 మందికి వైరస్ సోకింది. జీహెచ్ఎంసీ పరిధిలో 91 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 3,03,455కు పెరిగింది.
రాష్ట్రంలో కరోనా విజృంభణ... కొత్తగా 337 కేసులు
తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొత్తగా 337 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 2,958 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కోరలు చాస్తున్న కరోనా... కొత్తగా 337 కేసులు
వైరస్‌కు మరో ఇద్దరు బలయ్యారు. ఇప్పటివరకు మహమ్మారితో 1,671 మంది మరణించారు. తాజాగా 181 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,98,826 మంది కొవిడ్‌ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,958 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 1,226 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న 37,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి:మళ్లీ కరోనా కలవరం.. పెరుగుతోన్న రోజువారీ బాధితులు