రాష్ట్రంలో లక్షా 45వేలు దాటిన కరోనా కేసులు.. - కొవిడ్ 19 తాజా సమాచారం
09:30 September 08
రాష్ట్రంలో లక్షా 45వేలు దాటిన కరోనా కేసులు..
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 2వేల 392 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహమ్మారి బారిన పడి మరో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య లక్షా 45వేల 163కు చేరింది. ఇప్పటివరకు 906 మందిని వైరస్ కబళించింది.
తాజాగా 2వేల 346 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. హోంఐసోలేషన్‌లో 24వేల 579 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31వేల 670 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 304 కేసులు నమోదుకాగా.. రంగారెడ్డి 191, కరీంనగర్ 157, మేడ్చల్ 132, ఖమ్మం 116, నల్గొండ 105, నిజామాబాద్ 102, సూర్యాపేటలో 101 కేసులు వెలుగు చూశాయి.