తెలంగాణపై కరోనా పంజా... కొత్తగా 237 కేసులు - తెలంగాణలో ఇవాళ 237 కేసులు నమోదు
20:28 June 14
తెలంగాణపై కరోనా పంజా... కొత్తగా 237 కేసులు
రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 195 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్- 10, రంగారెడ్డి- 8, సంగారెడ్డి- 5, మంచిర్యాల జిల్లాల్లో 3 కొవిడ్- 19 కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,974కు చేరింది. మహమ్మారి సోకి ఈరోజు మరో ముగ్గురు మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 185కు చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,377 మంది డిశ్చార్జి కాగా... ఆస్పత్రిలో 2,412 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి:'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం.. 50 వేల మందికి పరీక్షలు'