రాష్ట్రంలో క్షమాభిక్ష కింద 141 మంది ఖైదీలు విడుదల
20:36 October 03
క్షమాభిక్ష కింద 141 మంది ఖైదీలు విడుదల
గాంధీజీ 151వ జయంతి సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష లభించింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 141 మంది ఖైదీలు క్షమాభిక్షకు అర్హులయ్యారని జైళ్ల శాఖ ఐజీ సైదులు తెలిపారు. వివిధ జైళ్ల నుంచి మొత్తం 141 మంది ఖైదీలను విడుదల చేశామన్నారు.
వరంగల్ జైలు నుంచి 38 మంది ఖైదీలు వారి సత్ప్రవర్తనతో విడుదలకు అర్హత సాధించారు. చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 22 మంది ఖైదీలకు క్షమాభిక్ష లభించింది. చంచల్‌గూడ పురుషుల జైలు నుంచి 13 మంది కాగా.. మహిళా జైలు నుంచి 15 మంది ఖైదీలు విడుదలయ్యారు.
ఇదీ చదవండి:పరిమితికి మించి ఖైదీలు- కొరవడిన సిబ్బంది