తెలంగాణ

telangana

ETV Bharat / state

అమెరికా నుంచి హైదరాబాద్​కు చేరుకున్న 118 మంది

118 మంది ప్రయాణికులతో కూడిన ప్రత్యేక విమానం అమెరికా నుంచి శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకుంది. వీరికి విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

118-members-reached-hyderabad-from-america-on-special-flight
అమెరికా నుంచి హైదరాబాద్​కు చేరుకున్న 118 మంది

By

Published : May 11, 2020, 12:35 PM IST

వందే భారత్​ మిషన్​లో భాగంగా అమెరికాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ మొదలైంది. శాన్​ఫ్రాన్సిస్కో నుంచి 225 మందితో బయలుదేరిన ప్రత్యేక విమానం నేడు ముంబై చేరుకుంది. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన 118 మంది ప్రయాణీకులతో శంషాబాద్ చేరుకుంది.

అమెరికా నుంచి హైదరాబాద్​కు చేరుకున్న 118 మంది

అధికారులు వీరికి విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అమెరికాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి లగేజీ తనిఖీల విషయంలో కూడా అధికారులు మరింత జాగ్రత్తలు వహిస్తున్నారు.

ఇవీ చూడండి:వేధింపులు తట్టుకోలేక భర్తను చంపిన భార్య...!

ABOUT THE AUTHOR

...view details