తెలంగాణ

telangana

ETV Bharat / state

భోలేనాథ్​కు మంచు దుప్పటి

కేదార్​నాథ్​లో జోరుగా మంచు కురుస్తోంది. హిమపాతంతో ఆలయ మరమ్మతు పనుల్లో జాప్యం కలిగింది.

మంచు దుప్పటిలో కేదార్​నాథ్

By

Published : Feb 6, 2019, 8:42 PM IST

కేదార్​నాథ్​లో విపరీతంగా కురుస్తోన్న మంచు
ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్​ ఆలయాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఆలయంలో జరుగుతున్న మరమ్మతు పనులకు ప్రతికూల వాతావరణం వల్ల జాప్యం కలిగింది. రహదారులపై మంచు పేరుకుపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అధికారులు అనేక గంటలు శ్రమించి... మంచులో చిక్కుకున్న పర్యటకులను రక్షించారు.

ఉత్తరాఖండ్​ వ్యాప్తంగా జోరుగా మంచు కురుస్తోంది. నైనిటాల్​, ధనౌల్తి వంటి పర్వత ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. మరికొన్ని రోజుల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details