తెలంగాణ

telangana

ETV Bharat / state

జూబ్లీహిల్స్​లో విగ్రహ ప్రతిష్ఠ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇవాళ జూబ్లీహిల్స్​ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. సాయంకాలం అంగరంగ వైభవంగా కల్యానోత్సవం జరిపారు.

జూబ్లీహిల్స్​లో విగ్రహ ప్రతిష్ఠ

By

Published : Mar 13, 2019, 9:52 PM IST

జూబ్లీహిల్స్​లో విగ్రహ ప్రతిష్ఠ
జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా క్రతువు జరిపించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

ఘనంగా కల్యానోత్సవం...

తెల్లవారుజామున స్వామి వారికి మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత కలశంతో వెంకటేశ్వర స్వామికి ఆవాహన చేశారు. అనంతరం ధ్వజస్థంభం ధ్వజారోహణం, బ్రహ్మదోష కార్యక్రమాలు చేశారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా కల్యానోత్సవం నిర్వహించారు. రాత్రి తిరు వీధుల్లో ఉత్సవం చేశారు.

ఇవీ చూడండి:కోటి రూపాయల డ్రగ్స్​ పట్టివేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details