తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో వార్​ వన్​సైడ్​ కానుందా...? - uttam

లోక్​సభ ఎన్నికలకు మరికొన్ని గంటల్లో షెడ్యూల్​ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో ఇప్పటికే వేడి రాజుకుంది. అసెంబ్లీ పోరులో ఘన విజయం సాధించిన తెరాస గెలుపు మాదేనంటోంది. మరోవైపు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. తెరాస- భాజపా కుమ్మకయ్యాయని విమర్శిస్తోంది.

వార్​ వన్​సైడ్​ కానుందా...?

By

Published : Mar 10, 2019, 1:38 PM IST

సార్వత్రిక ఎన్నికలకు ఇవాళ సాయంత్రం షెడ్యూల్​ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 17 పార్లమెంట్​ స్థానాలకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన తెరాస, కాంగ్రెస్​ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించాయి.

గెలుపుపై తెరాస ధీమా

పార్లమెంటరీ సన్నాహక సభల పేరుతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. కార్యకర్తలను, నాయకులను సమాయత్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్​ ఒక్కరే భుజానికెత్తుకున్నారు. మిగితా కీలక నేతలంతా కేటీఆర్​కు సహకారం అందిస్తున్నారు. 16 పార్లమెంట్​ సీట్లు గెలవడమే ధ్యేయంగా కార్యాచరణ సాగుతోంది. మొన్నటి ముందస్తు ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని తెరాస ధీమాగా ఉంది.

మోగిన హస్తం ఢంకా

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్​ పార్టీ సైతం లోక్​సభ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. కాంగ్రెస్​ సారథి రాహుల్​ గాంధీ శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల​లో జరిగిన సభలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. రాహుల్​ను ప్రధాని చేయడమే లక్ష్యంగా టీ కాంగ్రెస్​ సమరానికి సిద్ధమవుతోంది.

వీరు ఒంటరి పోరే

తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేసి ఉనికి కాపాడుకునే ప్రయత్నాల్లో భాజపా ఉంది. అదే తరహాలో తమకు బలమున్న ఒకటి రెండు స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగే ఆలోచనలో ఉంది సైకిల్​ పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా జట్టు కట్టినా... ఈసారి ఆ ప్రయత్నాలేమి కనిపించడం లేదు. మిగిలిన తెజస, వామపక్షాలు కూడా వాటి శక్తి మేరకు పోటీకి తయారవుతున్నాయి. ఎంఐఎం హైదరాబాద్​ సీటులో పోటీ చేస్తూ మిగిలిన చోట్ల తెరాసకు మద్దతు ఇవ్వనుంది.

ఇవీ చూడండి:'సమర భేరి' సాయంత్రమే...​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details