వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం(బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) తగ్గుతోంది. చేపలు బతికేందుకు కావలసిన కనిష్ఠ శాతం కూడా లేకుండా పోతోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లోని కొలనులో ఆక్సిజన్ శాతం పడిపోవడం వల్ల చేప పిల్లలు విలవిల్లాడుతున్నాయి. నీటి ఉపరితలం పైకి వచ్చి ఊపిరి పీల్చుకుంటున్న దృశ్యం కనిపించింది.
నీటిలో తగ్గిన ప్రాణవాయువు.. మరణశయ్యపై మీనాలు - dying
ఓ పక్క కాలుష్యకోరల్లో వాతావరణం నాశనం అవుతుంటే వాటి ప్రభావం జలావరణంపై పడుతోంది. నీటిలో ఆక్సిజన్ శాతం(బీవోడీ) తగ్గి చేపలు విలవిల్లాడుతున్న ఘటన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లోని కొలనులో చోటుచేసుకుంది.
నీటిలో తగ్గిన ప్రాణవాయువు.. మరణశయ్యపై మీనాలు
ప్రస్తుత పరిస్థితికి కారణం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులేనన్నారు మత్స్యశాఖ డీడీ లక్ష్మీనారాయణ. ఎండ తగిలితే నీటిలో ఆక్సిజన్ శాతం పెరిగి చేపలు బతికే అవకాశం ఉందని తెలిపారు. చేపలు బతకాలంటే కొలనులో కొత్త నీటిని చేర్చడం లేదంటే ఎయిర్ హీటర్స్ పెట్టాలని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: గొంగళి పురుగులతో కీళ్ల నొప్పులకు మందు!
Last Updated : May 14, 2019, 12:05 PM IST