ఎయిర్ హెల్ప్ సంస్థ విడదల చేసిన జాబితాలో అత్యుత్తమ విమానాశ్రయాలలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది. ఎయిర్ పోర్టు నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్ వంటి అంశాల ఆధారంగా 40దేశాల్లో 40వేల మంది ప్రయాణికులతో సర్వే నిర్వహించారు. మొదటి స్థానంలో ఖతార్ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీస్‌లోని ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు 2, 3 స్థానాల్లో నిలిచాయి. 2015 నుంచి ఈ ర్యాంకులు విడుదల చేస్తుండగా ఇవే మొదటి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. అమెరికా, యూకే నుంచి ఒక్కటీ టాప్ 10లో చోటు దక్కకపోవడం గమనార్హం. అత్యుత్తమ ఎయిర్లైన్ల ర్యాకింగ్స్లో ఖతార్ ఎయిర్‌లైన్స్ మొదటి స్థానం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2, ఏరో మెక్సికో 3 స్థానం సంపాదించాయి.
టాప్ 10 అత్యుత్తమ విమానాశ్రయాలు ఇవే..