తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదుగురు మునిగారు.. నలుగురే తేలారు

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు వద్ద గోదావరిలోకి ఐదుగురు స్నేహితులు స్నానానికి వెళ్లారు. అందులో ఓ యువకుడు గల్లంతయ్యాడు.

ఐదుగురు మునిగారు.. నలుగురే తేలారు

By

Published : Jul 13, 2019, 10:30 PM IST

ఐదుగురు మునిగారు.. నలుగురే తేలారు

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు వద్ద గోదావరిలో భాస్కరసాయి అనే వ్యక్తి గల్లంతయ్యాడు. పోడూరు గ్రామానికి చెందిన భాస్కర సాయి... హైదరాబాద్ ఫార్మసీ కంపెనీలో 3 నెలల క్రితం ఉద్యోగంలో చేరాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న మరో ఐదుగురు స్నేహితులతో కలిసి గురువారం స్వగ్రామం కోడూరు వచ్చారు. శుక్రవారం ద్వారకాతిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం మా సేన్ అమ్మ ఆలయానికి బయలుదేరారు. సమీపంలో ఉన్న కోడేరు వద్ద నదిలోకి ఐదుగురు స్నేహితులు స్నానానికి దిగారు. అదే సమయంలో ప్రవాహంలో స్నేహితులంతా చిక్కుకుకుని... కేకలు వేశారు. సమీపంలో ఉన్న జాలర్లు వచ్చి నలుగురు యువకులను కాపాడారు. అప్పటికే భాస్కర సాయి ప్రవాహంలో మునిగి గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details