భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఉపరితల గని విస్తరణలో తమకు న్యాయపరమైన పరిహారం రాలేదంటున్న నిర్వాసితులను ఖాళీ చేయించే ప్రయత్నంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల నివాసాలపై సింగరేణి అధికారులు సిబ్బందితో కలిసి ఖాళీ చేయించేందుక ప్రయత్నించారు.
సింగరేణి నిర్వాసితులకు అధికారుల మధ్య ఉద్రిక్తత.. మహిళకు గాయం
ఇల్లందు పట్టణంలోని సింగరేణి నిర్వాసితులకు అధికారులకు మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమకు న్యాయమైన పరిహారం రాలేదని నిర్వాసితులు తమ నివాసాలను ఖాళీ చేయమని అనడం వల్ల కొద్దిపాటి ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఒక మహిళకు గాయమైంది.
సింగరేణి నిర్వాసితులకు అధికారుల మధ్య ఉద్రిక్తత.. మహిళకు గాయం
ఈ క్రమంలో ఒక మహిళ తలకు గాయమైంది. ఆగ్రహించిన నిర్వాసితులు అధికారుల వాహనం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు ఖాళీ చేయమని నిర్వాసితులు తేల్చి చెప్పారు.
ఇవీ చూడండి :రామప్ప కాటన్ పేరుతో రానున్న కొత్త రకం చీరలు