భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కురవపల్లి కొత్తూరు గ్రామంలోని పోడుభూముల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో కందకాల తవ్వే పనులను గ్రామస్థులు అడ్డుకున్నారు. అటవీ భూముల్లో పోడు సాగు చేస్తున్నారని అటవీ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. అటవీ అధికారుల తీరును నిరసిస్తూ.. గ్రామస్థులు గత 15 రోజుల నుంచి టెంట్ వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కందకాల తవ్వే పనులను అడ్డుకున్న గ్రామస్థులు
పోడుభూముల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో కందకాల తవ్వే పనులను గ్రామస్థులు అడ్డుకున్నారు. అటవీ అధికారుల తీరును నిరసిస్తూ... గ్రామస్థులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శుక్రవారం ఉదయం ఆ భూముల్లో యంత్రాల సాయంతో కందకాలు తవ్వేందుకు ప్రయత్నించగా.. గ్రామస్థులు యంత్రాలకు అడ్డుగా నిలిచారు. ఈ నేపథ్యంలో అటవీ సిబ్బంది గ్రామస్థుల మధ్య తోపులాట జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అటవీ అధికారుల తీరును నిరసిస్తూ... గ్రామస్థులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్థులను చెదరగొట్టారు. కొంతమందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.