భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని కుమురం భీం విగ్రహానికి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి...
జీవో నెంబర్ 3 పై ఆదివాసీల ఆందోళనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయ పోరాటం చేస్తోందన్నారు. జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో పలు పంచాయతీల పరిధిలోని పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ నాయకులు కోరారు. ఆదివాసీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : ఫిర్యాదులకు కొత్త వేదిక... సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు