Telangana Rain Alert 2023 : రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా బలపడిందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి వైపు వాలి వచ్చే రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది.
Flood Water Flowing in Chinthal : నీటమునిగిన చింతల్.. ఇళ్లలోకి చేరిన వరద నీరు
Godavari Water Level At Bhadrachalam Today : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వాగులు, చెరువుల్లో జలకళ సంతరించుకుంది. గురువారం కురిసిన వర్షానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం (Godavari Water Level Today) క్రమ క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 33 అడుగులు దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో ఉన్న తాలిపేరు నుంచి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
సమక్క సారక్క బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కూడా దిగువకు విడుదల చేయడంతో భద్రచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు వల్ల భద్రచలం వద్ద ఇంకా మూడు అడుగుల వరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. నీటిమట్టం పెరగడంతో గోదావరి వరద భద్రాచలం వద్ద స్నాన ఘట్టాల వరకు నీరు చేరుకుంది.