తెలంగాణ

telangana

పోరాటానికి సిద్ధం: మధ్యాహ్న భోజన పథకం కార్మికులు

By

Published : Nov 24, 2019, 5:01 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలు రెండో రోజు కొనసాగుతున్నాయి.

రెండో రోజు కొనసాగుతున్న రెండో మహాసభలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలు జరుగుతున్నాయి. చాలా ఏళ్లుగా మహిళా కార్మికులు మధ్యాహ్న భోజన పథకంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మహిళా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు రమ తెలిపారు. మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం... వచ్చే నెలలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే పక్షంలో సమ్మెని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

రెండో రోజు కొనసాగుతున్న రెండో మహాసభలు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details