భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద నీరు నిలకడగా ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రం 36 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు 36 అడుగుల వద్దనే నిలకడగా ఉంది. భద్రాచలానికి ఎగువ ప్రాంతంలో ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు జలాశయంలో 15 గేట్లను ఎత్తి 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరం, పేరూరు వద్ద కూడా నీటిమట్టం ప్రస్తుతం నిలకడగానే ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలుపారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురవడం వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారిపై చెట్లు విరిగి పడటం వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 36 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. తాలిపేరు జలాశయంలో 15 గేట్లను ఎత్తి 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
గోదావరి