తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్ని రోజులు నిర్బంధం.. తిండిలేక డ్రైవర్ల, క్లీనర్ల నరకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద సరిహద్దు ప్రాంతాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. మూడు రోజులుగా తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్నామని.. ఇలా ఎన్నిరోజులు వాహనాల్లోనే నిర్బంధంలో ఉండాలని వాహనదారులు వాపోతున్నారు.

stopped vehicles at bhadradri kothagudem bhadrachalam
ఎన్ని రోజులు నిర్బంధం.. తిండిలేక డ్రైవర్ల, క్లీనర్ల నరకం

By

Published : Mar 24, 2020, 1:05 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో లాక్​డౌన్ రెండోరోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. గత మూడు రోజుల నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నారు. అయితే రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన ఛత్తీస్​గడ్​, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోని వచ్చే భారీ వాహనాలకు అనుమతివ్వడం లేదు. దీనితో సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

గత మూడు రోజుల నుంచి తాము నిర్బంధంలోనే ఉన్నామని దయచేసి అధికారులు స్పందించి మా వాహనాలను తెలంగాణలోనికి వెళ్లడానికి అనుమతించాలని వాహనదారులు కోరుతున్నారు. ఎన్ని రోజులు నిర్బంధంలో ఉండాలో తెలియక తినడానికి నిత్యావసర వస్తువు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహన డ్రైవర్లు క్లీనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ని రోజులు నిర్బంధం.. తిండిలేక డ్రైవర్ల, క్లీనర్ల నరకం

ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ABOUT THE AUTHOR

...view details