తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2020, 12:58 PM IST

ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: బ్లాస్టింగ్ వార్తకు స్పందించిన అధికారులు

ఈటీవీ భారత్​ ప్రచురించిన కథనానికి సింగరేణి అధికారులు స్పందించారు. ఈ నెల 12న 'ప్రమాదకరంగా మారిన సింగరేణి ఉపరితల గనుల బ్లాస్టింగ్' అనే శీర్షికతో వచ్చిన వార్తకు అధికారులు స్పందించి... ఇల్లందులో సింగరేణి బ్లాస్టింగ్​ ప్రభావిత ఇళ్లను పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.

singaresni-officials-responded-to-etv-bharat-news-in-bhadradri-kothoagudem-district
ప్రమాదభరితంగా బ్లాస్టింగ్ వార్తకు స్పందన

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జేకే 5 ఉపరితల బొగ్గు గని బ్లాస్టింగ్ కారణంగా ఇళ్ల పగుళ్లతో పాటు స్లాబ్ పెచ్చులు పడి ఒక మహిళ తలకు గాయమైంది. ఈ నెల 12వ తేదీన ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్​లో వచ్చిన వార్త నేపథ్యంలో సింగరేణి అధికారులు స్పందించారు.
సింగరేణి బ్లాస్టింగ్​ ప్రభావిత ఇళ్లను, దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి ప్రమాదంలో గాయపడిన మహిళతో మాట్లాడారు. పూర్తి నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ఏఎస్​వో శ్రీనివాస్, సివిల్ అధికారి రవి కుమార్ పాల్గొన్నారు


ఇవీ చూడండి: ప్రమాదకరంగా మారిన సింగరేణి ఉపరితల గనుల బ్లాస్టింగ్

ABOUT THE AUTHOR

...view details