తెలంగాణ

telangana

ETV Bharat / state

చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా

ఖమ్మం జిల్లా, భద్రాద్రి జిల్లాల్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొంతకాలంపాటు అదుపులో ఉన్న కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తుండటం జిల్లా వాసుల్లో ఆందోళన కలుగుతోంది. శుక్రవారం రెండు జిల్లాల్లో కలిపి మొత్తం ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి.

చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా
చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా

By

Published : Jun 27, 2020, 9:38 AM IST

ఖమ్మం జిల్లాలో కొత్తగా ఐదుగురు కరోనా బారిన పడ్డారు. ఖమ్మం నగరంలో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. రోటరీనగర్‌కు చెందిన ఓ యువకుడితోపాటు సారధినగర్‌లో ఓ యువతికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. ఎన్‌ఎస్‌టీ రోడ్డులో మరో వ్యక్తికి మహమ్మారి సోకింది.

వీరితో పాటు వేంసూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృత్యువాతపడగా.. దెందుకూరులో ఓ మహిళకు వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కొవిడ్ బాధితుల సంఖ్య 55కు చేరగా.. 25 ఆక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాల్వంచలోని కేటీపీఎస్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి వైరస్‌ సోకింది. కొత్తగూడెం సింగరేణి గౌతమ్ పూర్ కాలనీలో సింగరేణి కార్మికుడి కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 16 కేసులు నమోదుకాగా.. 9 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇవీచూడండి:గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ABOUT THE AUTHOR

...view details